Saturday, January 28, 2017

Vedadri Temple - Jaggayyapet (వేదాద్రి ఆలయం - జగ్గయ్యపేట)

Vedadri Temple - Jaggayyapet (వేదాద్రి ఆలయం - జగ్గయ్యపేట)
కృష్ణ జిల్లాలో జగ్గయ్యపేట మండలంలో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో కృష్ణానది తీరాన వేదాద్రి అనె గ్రామములో పర్వత పాదభాగాన శ్రీ జ్వాలా నరసింహక్షేత్రం కలదు.ఇది చాల ప్రాచీన ఆలయం.ఈ ప్రదేశంలో కృష్ణనది ఉత్తరవాహిని న ప్రవహిస్తుంది.ఇచట నరసింహ స్వామి పంచ రూపాత్మకుడై జ్వాలా సాలగ్రామ వీర యోగానంద లక్ష్మి నరసింహస్వామి,వారిగా సేవలందుకొనుచున్నాడు.ఈ ఆలయం 12 శతాబ్దం లో కాని 13 శతాబ్దంలోగానీ నిర్మించినట్లు చరిత్ర తెలియజేయుచున్నది.

చరిత్ర:- సోమకాసురుడు అనె రాక్షేసుడు వేదములను దొంగలించి సముద్రంలో దాగగా, అతనిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తి, సోమకాసురుని సంహరించి వేదములను ఉధ్ధరించాడు.అపుడా వేదములు సంతోషించి శ్రీ మహావిష్ణువుతో ,దేవా! నీవు నేటి నుండి మా శిరముల పై నదిరొహించి మమ్ములను తరింపజేయమని కోరాయి.

అప్పుడు శ్రీమహా విష్ణువు వేదములకోరిక విని,చతుర్వేదములరా! నేను మునుముందు ప్రహ్లాదుని రక్షణార్ధం ఉగ్రనరసింహవతారమెత్తగలను.అప్పుడు మీ కోరిక నెరవేర్చదను.అందాకా మీరు కృష్ణవేణి నదీ గర్భాన సాలగ్రామరూపంలో ఉన్న నా మిద విశ్రమించండి అని చెప్పి , వేదములను సముదాయించడట! ఆ ప్రకారం వేదములు శ్రీ మహావిష్ణువురూపం ఐన సాలగ్రామం మిద విశ్రాంతి తీసుకున్నాయి కొంతకాలం తరువాత ప్రహ్లాదుడి రక్షానార్దం శ్రీ మహావిష్ణువు ఉగ్రనరసింహవతారమెత్తి హిరన్యకశివుని సంహరించి తాను వేదములకుఇచ్చినా మాట ప్రకారం వేదములు ప్రతిద్వనించుచున్న వేదాద్రి శిఖరము మిద జ్వాలరూపమున వెలిశాడు.ఆ విధంగా తమ శిరము అయినా వేదాద్రి శిఖరము మిద వెలసిన శ్రీ మహావిష్ణువును చూసి వేదాలుఎంతో సంతోషించాయి.ఈ వేదాద్రి క్షేత్రములో నరసింహఅవతారం లోని తాన ఐదు అంశాలను వేదాద్రి అంతటా ఆవిర్బింపజేశాడు.

ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కృష్ణవేణి లో సాలగ్రామ రూపంగాను , పర్వతాగ్రముమీద శ్రీ జ్వాలా నరసింహరూపానిగ, పర్వత పాదభాగాన యోగనంద శ్రీ లక్ష్మినరసింహరూపాలుగా,గరుడాద్రి మిద శ్రీ వీర నరసింహ రూపంతో వెలయుటచే,ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రముగ ప్రసిద్ది గాంచింది.ఆ తరువాత పర్వత పాదపిఠాన శ్రీ యోగానంద లక్ష్మినరసింహులకు ఓక ఆలయం నిర్మించబడినది. ఆ ఆలయం శ్రీ యోగానంద లక్ష్మినరసింహలయముగ ప్రసిద్ది చెంది భక్తజనావళిచే పూజలు అందుకొనుచు ప్రవిర్థతమగుచున్నది.

పశ్చిమాభిముఖంగ ఉన్న ఆలయంలో గర్భాలయంలో,అంతరాలయం,మండపం అను మూడు భాగాలుగా ఉన్నది.మూలవిరాట్టు పడమటి ముఖంగా కృష్ణనది వైపు తిరిగి ఉంటుంది.ఆలయం గర్భగృహమునందు యోగానంద లక్ష్మినరసింహుడు, అంతరాయములో ఎడమవైపున రాజ్యలక్ష్మి అమ్మవారు, ఆదిలక్ష్మిదేవి,కుడివైపున ఆళ్వారు సన్నిధి, మండపమునందు కుడివైపున చెంచులక్ష్మిదేవి యొక్క పవళింపు సేవామందిరము,ఎదురుగా గరుడ ఆళ్వారు మొదలగు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు.ఈ ఆలయములో నూతనంగా నిర్మించిన గోపురాలు మాత్రం అత్యంత సుందరంగా ఉన్నాయి. యోగనిష్టలో ఉన్న స్వామి కల్యాణమునకు సంసీద్దుడు కాడని భావించిన ఋష్యశ్రృంగుడు శాంతా దేవితో కుడి లక్ష్మినారసింహాన్ని ప్రతిష్టించి శాంతి కల్యాణానికి జరిపించాడని స్థలపురాణం.అదే సాంప్రదాయంతో శ్రీ లక్ష్మినరసింహాస్వామివారికీ ప్రతి సంత్సరం వైశాఖశుద్ధ ఏకాదశి మొదలు పంచాహ్నికంగా తీరుకళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

No comments:

  © Blogger template 'Minimalist F' by Ourblogtemplates.com 2008

Source from INDIAN MYTHOLOGY   TOP